బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ పై ముంబై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. అతడిపై ఇప్పటికే కేసు నమోదు కాగా, నిన్న చెంబూరు పోలీసులు నోటీసు లిచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. రణ్వీర్ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేదు. ఆగస్టు 16న తిరిగివస్తానని రణ్వీర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రోజు మళ్లీ పోలీసులు వెళ్లి నోటీసులు అందించనున్నట్లు పేర్కొన్నారు. విచారణ కోసం ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ…