ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఆసియా క్రీడల్లో 14వ రోజు కూడా భారత్ పతకాల పరంపరను కొనసాగించింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.