నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రజలు గుమికూడిన సమయంలో రెండు పెద్ద బాంబు పేలుళ్లు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పేలుడులో కనీసం 100 మందికి పైగా మరణించగా.. 170 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. జనవరి 3, 2020న ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు, కాన్వాయ్‌లోని రెండు కార్లు…