దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు గురువారం రాజ్యసభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్ 2020 మధ్య నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా, అదే కాలంలో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 12.1 శాతం…
కరోనా మహమ్మారి వేళ కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద తెలంగాణలోని లక్షలాదిమంది వలస కార్మికులకు సాయం అందించింది. 1.84 లక్షల మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.66 కోట్లు ఖర్చుపెట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద1.73 లక్షల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.69 కోట్లు కేంద్రం వెచ్చించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి స్పష్టం చేశారు. దీనికి అదనంగా భవన నిర్మాణ…