అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.