ఏపీలో ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయుర్ పోర్ట్ ను కూడా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం..
Ram Mohan Naidu: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో జరిగిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కు కావాల్సిన భూమి చూపించలేకపోయిందని., ఈ కారణంగానే రైల్వే జోన్ ప్రక్రియ ఆలస్యం అయ్యిందని., రైల్వే జోన్ కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని., కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ ను టాప్ ప్రియారిటీగా తీసుకుందని అన్నారు.…
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణం అని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపిలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకుడులలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్ నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు కింజరాపు…
సీఎం జగన్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గెలిచారు.. కానీ, గెలిచాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోయారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అమలు చేయలేదు.. రాష్ట్రం అతలాకుతలంగా మారింది అని ఆయన చెప్పారు.
తెలుగు దేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మూడో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలి.. రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించాలంటూ ఆయన అన్నారు.
నిన్న మొన్నటి వరకు కూల్ కూల్ అన్నారు. టైమ్ వచ్చేవరకు ఓపిక పట్టాలని ఓదార్చారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి కాలు దువ్వుతున్నారు బాబాయ్ అబ్బాయ్. అందరి లెక్కలు రాస్తున్నాం.. తిరిగి చెల్లిస్తాం అని వార్నింగ్‌లు ఇస్తున్నారట. ఎందుకు గేర్ మార్చారు? వాళ్ల రాసుకుంటున్న లెక్కలేంటి? బాబాయ్, అబ్బాయ్‌లకు ఏమైందని తమ్ముళ్ల ప్రశ్న! వైసీపీ గాలిలో కూడా 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు. టెక్కలి నుంచి అచ్చెన్న ఎమ్మెల్యేగా గెలిస్తే.. రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీగా…