టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమా ‘శివ’. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన శివ టాలీవుడ్ ధోరణిని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ సినిమా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్…