రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది.
కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ క్షమాపణ చెప్పేందుకు ఖర్గే ఖరాకండిగా ససేమిరా అన్నారు.