Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కేరళలో…
సూపర్ స్టార్ రజనీకాంత్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం అభిమానులను కూడగట్టుకున్నారు. బాలీవుడ్‌లో కూడా మంచి పేరు సంపాదించిన రజినీకాంత్ అభిమానుల సంఖ్య అపారం. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఈ వయసులో సైతం ప్రధాన నటుడిగా సినిమాలు చేస్తూ ప్రజాధారణ పొందుతున్నారు.