మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలని, ఎలాగైనా చిరు చూడాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. సైకిల్‌పై హైదరాబాద్ చేరుకుంది రాజేశ్వరి. Also Read…