(ఆగస్టు 31న ప్రముఖ రచయిత రాజశ్రీ జయంతి)ఇందుకూరి రామకృష్ణంరాజు అంటే జనానికి అంతగా తెలియదు కానీ, రచయిత రాజశ్రీ అనగానే ‘ఓస్…మనోడే…’ అంటారు తెలుగు సినిమా అభిమానులు. బహుముఖ ప్రజ్ఞకు మరోరూపం రాజశ్రీ అని చెప్పక తప్పదు. పాటలు పలికించారు. మాటలతో అలరించారు. అనువాద చిత్రాలకు మరింతగా రచన చేసి మురిపించారు. సంగీతం సమకూర్చారు. దర్శకత్వమూ నెరిపారు. ఏది చేసినా అందులో తనదైన బాణీ పలికించారు. అందుకే రాజశ్రీ అనగానే ఆయన బహుముఖ ప్రజ్ఞను ఈ నాటికీ…