దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పులి, దాని నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఐదు పులులు చనిపోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అయితే చనిపోయిన పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపిందని…