కమెడియన్, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ మాధ్యమంగా వెల్లడించాడు. తన కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్ళి విషయాన్ని రాహుల్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజానికి.. రాహుల్ ప్యాండెమిక్‌కి ముందే తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అప్పుడు కుదరకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు…