నాలుగు వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ ధారాదత్తం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నుంచి మీడియా దృష్టి మరల్చేందుకు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.