ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ మూవీ మన మనసుకు, నమ్మకానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పాడు. ఇది జరిగిపోయిన స్టోరీ కాదు.. జరగబోయే స్టోరీ కాదు… ఎప్పుడూ నడుస్తున్న స్టోరీనే…