రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో తనకంటూ ఒక పరపడి ఏర్పాటుచేసుకున్న ప్రముఖ రచయిత. స్వతహాగా న్యాయవాది అయిన రావిశాస్త్రీ న్యాయస్థానంలోనే గాక తన జీవితంలోలోనూ పేదలకు న్యాయం కోసం కలం అంకితం చేసిన గొప్ప రచయిత.వర్గసమాజంలో ప్రత్యక్షంగానే గాక కనిపించకుండా సాగే క్రూరమైన పీడననూ, న్యాయప్రక్రియలో వర్గ వైరుధ్యాలను కళ్లకు కట్టిన ప్రజారచయిత. 1922 జులై30న విశాఖ జిల్లా తుమ్మపాలెంలో పుట్టిన రావిశాస్త్రి శతజయంతి వత్సరం మొదలవుతున్నది.1940లలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో…