నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో ఆరో ఎపిసోడ్ భలే సందడి చేసిందనే చెప్పాలి. ‘అఖండ’ విజయం సాధించిన ఉత్సాహం ఓ వైపు… ‘పుష్ప’ విజయసువాసనలు మరో వైపు పరిమళిస్తూండగా సాగిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రక్తి కట్టించింది. ఈ కార్యక్రమంలో ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ముందుగా హాజరయ్యారు. తరువాత నాయిక రష్మిక వచ్చేసింది. చివరలో అల్లు అర్జున్ రాగానే సందడి మరింత పెరిగింది. 47 నిమిషాల పాటు సాగిన…