సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు. తాజాగా పూణేలో ఓ రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి ఏఖంగా రూ. 1.19 కోట్లు కాజేశారు. తన జీవిత కాలంలో దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ వేధింపులు, ఆర్థిక నష్టం ఒత్తిడి కారణంగా బాధితుడు అక్టోబర్ 22న ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించినట్లు…