Mumbai Accident : పూణె తరహాలో మరో కారు ప్రమాదం ముంబైలో వెలుగు చూసింది. ఈ ఉదయం ముంబైలోని వర్లీలో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
పూణె కారు ప్రమాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మద్యం మత్తులో మైనర్ కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలు తీశాడు. అనంతరం గంటల వ్యవధిలోనే మైనర్ నిందితుడికి బెయిల్ రావడం.. అలాగే ప్రమాదంపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం.. ఇదంతా తీవ్ర దుమారం చెలరేగింది.