Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో చేర్చుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో క్యాచ్ అందుకున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో క్యాచ్ పట్టిన ఫీల్డర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డక్ అవుట్ గా వెనుదిరగగా, ర్యాన్ రికెల్టన్ 7 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రికెల్టన్ వికెట్ నాండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్‌ను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా అందుకున్నాడు. ఇదే అతడి తొలి ఐపీఎల్ క్యాచ్. ఈ క్యాచ్‌తో 15 సంవత్సరాలు 58 రోజుల వయసులో ఐపీఎల్లో క్యాచ్ పట్టిన అతి చిన్న వయసు ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.
Also Read
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ఐపీఎల్లో అతి చిన్న వయసులో క్యాచ్ పట్టిన ఆటగాళ్లు:
15 ఏళ్లు 58 రోజులు – వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) vs ముంబై ఇండియన్స్, 2026
17 ఏళ్లు 16 రోజులు – ముజీబ్ ఉర్ రహ్మాన్ (పంజాబ్ కింగ్స్) vs ఆర్సీబీ, 2018
17 ఏళ్లు 163 రోజులు – రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) vs ఢిల్లీ క్యాపిటల్స్, 2019
17 ఏళ్లు 181 రోజులు – ప్రదీప్ సంగ్వాన్ (ఢిల్లీ) vs ముంబై ఇండియన్స్, 2008
17 ఏళ్లు 201 రోజులు – వాషింగ్టన్ సుందర్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్) vs ముంబై ఇండియన్స్, 2017
ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓటమిపై స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తమ బౌలర్లు 10 నుంచి 15 పరుగులు అదనంగా ఇచ్చారని, పవర్‌ప్లేలో వరుస వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను దూరం చేసిందని తెలిపాడు. మేము బౌలింగ్‌లో మరో 10-15 పరుగులు తగ్గించాల్సింది. పిచ్ రెండు ఇన్నింగ్స్ లలో ఒకేలా ఉంది. కానీ పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం మాకు పెద్ద దెబ్బ అయిందని హార్దిక్ పేర్కొన్నాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగా, వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!