Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crude Oil Prices Fall: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ప్రకటించడంతో, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలపై ఆశలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హార్మూస్ జలసంధి మూసివేత భయాలు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూసివేయబడితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, త్వరలో హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ అంశంపై తన సలహాదారులతో చర్చలు కొనసాగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.
Also Read
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు
డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. చాలా రోజుల తర్వాత తొలిసారిగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 92 డాలర్ల వరకు పడిపోయింది. గత వారం వరకు యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు శాంతి చర్చల వార్తలతో మార్కెట్లో ఊరట కనిపిస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా భారీగా పెరిగాయి. బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై భారంగా మారాయి. భారతదేశంలో కూడా గత నాలుగేళ్లలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ, కేవలం 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేసింది.
చమురు కంపెనీలు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నందున ధరలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 50 నుంచి 60 పైసల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరింత తగ్గితే, రాబోయే రోజుల్లో ఇంధన ధరల్లో కూడా తగ్గుదల కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!