సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. ఈరోజు ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.