జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా పీఎస్ఎల్ 2025 ఫైనల్ కోసం 6 వేల కిలీమీటర్లకు పైగా ప్రయాణించాడు. ప్రయాణం మాత్రమే కాదు.. టైటిల్ గెలవాలడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ పడటానికి కేవలం పది నిమిషాల ముందు లాహోర్ ఖలందర్స్ జట్టుతో కలిశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన ఇంగ్లాండ్-జింబాబ్వే టెస్ట్ మ్యాచ్ మూడో రోజు సికందర్ రాజా 68 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ వాయిదా పడింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్ 2025ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (మే 7) నుంచి పీఎస్ఎల్ మ్యాచ్ జరగలేదు. గురువారం రావల్పిండిలో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. రావల్పిండి స్టేడియంకు సమీపంలో భారత్ దాడులు జరపడంతో ఈ మ్యాచ్ రద్దు అయింది. భారత్, పాకిస్థాన్…
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా చేపట్టింది. బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందిని మట్టుబెట్టింది. గురువారం కూడా దాడులు కొనసాగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో గురువారం ఒక డ్రోన్ కూలింది. స్టేడియం సమీపంలోని ఒక రెస్టారెంట్ భవనంపై డ్రోన్ పడగా.. పలువురు గాయపడ్డారు. ఈ డ్రోన్ ఐపీఎల్ 2025 మ్యాచ్‌కు ముందు కుప్పకూలడంతో పీసీబీ బయపడిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్…
PSL మస్కట్ (తలపాగా), PSL ట్రోఫీతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు నిలబడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇందులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించింది. అందులో రోహిత్ శర్మ.. "ట్రోఫీ గెలవడం అంత సులభం కాదు" అని చెబుతారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 13, 14, 16 తేదీల్లో క్వాలిఫైయర్.. ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే మే 18న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది.