Minister Seethakka : వేసవి దాహాన్ని తీర్చేందుకు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (పీఆర్‌ఆర్‌డీ) శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో భారీ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,090 చలివేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వేసవి కాలంలో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి. మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలతో పీఆర్‌ఆర్‌డీ అధికారులు గ్రామాల నుంచీ రద్దీ ప్రాంతాల వరకు ప్రతి చోట చలివేంద్రాలను…