రాపిడో నుంచి స్విగ్గీ సంస్థ బయటకు వస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్ బ్రిడ్జ్లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్లో ఉన్న ఎంఐహెచ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ బీవీకి…