కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు.