ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హవా నడుస్తోంది.. ఎక్కడ చూసినా ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రమోషన్సే కనిపిస్తున్నాయి. వివేక్ అత్ర్య దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచేసిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు.…