దేశ ప్రజలంతా దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్నారు. దసరా రోజున రావణాసురుడి, సూర్పణక దహనాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అయ్యింది ఓ సామాజిక సంస్థ. దసరా రోజున ‘సుర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ తెలిపింది. సోనమ్‌తో పాటు భర్తలను, పిల్లలను, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు…