వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎ. ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాల’ని ఆకాంక్షించారు. ఓ మంచి కథతో హీరోగా…