తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు, ఇటీవల నటన పరంగా కాస్త వెనుకబడిన సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘శుభం’ సినిమాను నిర్మించిన సమంత, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.…