Increments in India: లేచింది మొదలు.. పడుకునే వరకు.. లేఆఫ్ వార్తలతో నీరసించిపోతున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఒక శుభవార్త. ఈ ఏడాది శాలరీలు పది శాతానికి పైగానే పెరగనున్నాయి. 46 శాతం సంస్థలు ఈ సంవత్సరం.. ఉద్యోగుల వేతనాలను రెండంకెల శాతం పెంచాలని భావిస్తున్నాయి. కనీసం 10 పాయింట్ 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాయి. టెక్నాలజీ రంగంలో 12 పాయింట్ 9 శాతం, ఇ-కామర్స్ సెక్టార్‌లో 12 పాయింట్ 2 శాతం హైక్స్ ఇవ్వనున్నాయి.
కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు బ్రిక్స్ కూటమిలోని…