తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమని సీఎం తెలిపారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని,అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం హితవు పలికారు.ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు.. తీసుకురావల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా రంగానికి…