బంగ్లాదేశ్ అల్లర్లతో తమకు సంబంధం లేదని అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ ప్రియరీ ఖండించారు. ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న నిర్ణయమని తెలిపారు. వారి భవిష్యత్‌ను నిర్ణయించుకునే అధికారం వారికే ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇది తప్ప ఇంకేమీ ఆరోపణలు వచ్చినా అవన్నీ అవాస్తవమేనని జీన్ ప్రియరీ స్పష్టం చేశారు.