అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్.. విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచీ వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి.