భారతదేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించి, నటించిన నటనిర్మాతగా మోహన్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన కూతురు లక్ష్మీప్రసన్న పేరిట 1982లో 'శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్' సంస్థను నెలకొల్పి, తరువాత దాదాపు యాభై చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు.