ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమే జరిగింది.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు జెండా మార్చేశారు.. అదేనండి.. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పీకే సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది..