మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధి ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.