Yoga Day : యోగాను వర్ణించే పతంజలి, ఒక సూత్రంలో “యోగం అంటే మనస్సు , బుద్ధి వృత్తుల నుండి విముక్తి.” ఇలా అంటాడు. మరింత వివరిస్తూ “మనస్సుకు ఐదు వృత్తులు ఉన్నాయి – ప్రతిచోటా న్యాయాన్ని కోరుకోవడం, వాస్తవికతను తప్పుగా గ్రహించడం, ఊహ, నిద్ర , జ్ఞాపకశక్తి.” అని పేర్కొన్నారు. రోజంతా మీ మనస్సు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలలో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. కానీ రోజులో ఏ సమయంలోనైనా మీరు నిద్రపోకపోతే,…
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది.