గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలు కానున్నాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.54 గంటలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా…