Air Force's Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.