నటభూషణ శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదగడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. 1959లో ‘దైవబలం’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన శోభన్ బాబుకు సోలో హీరోగా బంపర్ హిట్ దక్కింది 1971లోనే. ఆయనకు ఆ విజయాన్ని అందించిన చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. అప్పటి దాకా శోభన్ బాబు ఇతర స్టార్ హీరోస్ చిత్రాలలో సైడ్ కేరెక్టర్స్ పోషిస్తూనే వచ్చారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుస విజయాలతో…