ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన సగం కాలిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. తోటి స్నేహితుడే, ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అసలు హత్య ఎందుకు చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఈ నెల 3న దారుణ హత్య జరిగింది. క్రీడా మైదానం వద్ద సరిగా పాతికేళ్లు కూడా నిండని యువకుడి మృతదేహం…