అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు.
సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ జగ్గన్నతోటలో, జరిగే ప్రభలతీర్థానికి దేశ స్థాయిలో ప్రత్యేకగుర్తింపు ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో నేడు ప్రభల ఉత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై… ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. కనుమ పండుగ రోజున ప్రభల…