అనంతపురం జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఇస్తున్న షాక్ మామూలుగా లేదు. ఆదివారం సెలవుకు తోడు, సోమవారం పవర్ హాలిడే ఇవ్వడంతో పరిశ్రమలు నష్టాల దిశగా పయనిస్తున్నాయి. దీనికి తోడు అనధికారిక కోతలతో పరిశ్రమలో పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగుల వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. గ్రానైట్, జీన్స్‌తోపాటు అనంతపురం, హిందూపురంలలో పారిశ్రామిక వాడలో ఒక విధమైన స్తబ్థత నెలకొంది. ఈ ప్రభావం కార్మికులపై కూడా పడుతుండటంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. దేశంలోని…