ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆరుగురపై సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆరుగురిపై వేర్వేరు చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఏ.శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, సుశ్వరం శ్రీనాథ్, జీ. శ్రీధర్ రెడ్డి, సుద్దులూరి అజయ్ అమృత్, దరిష కిషోర్ రెడ్డిలపై చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది. అయితే గతంలోనూ అనుచిత పోస్టుల కేసులో ఐదుగురిపై…