వెస్టిండీస్ గడ్డపై ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొట్టింది. ఫైనల్‌లో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే వెస్టిండీస్‌లో ఏడుగురు అండర్ 19 టీమిండియా ఆటగాళ్లకు అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లను అధికారులు అడ్డుకున్నారని.. 18 ఏళ్లు నిండని వారికి భారత్‌లో వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించలేదని వివరణ ఇచ్చినా అధికారులు వినిపించుకోలేదని టీమిండియా మేనేజర్…