Gujarat : గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ ఐదుగురిలో ఒక మహిళ కూడా ఉంది, ఆమె పేరు సుమేరా బానో. ఈ ఐదుగురు ఉగ్రవాదుల గురించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు గుజరాత్‌లో 26/11 తరహా ఉగ్ర దాడిని చేయాలనుకున్నారు.
'బిపర్‌జోయ్' తుఫాను ఉత్తర దిశగా పయనిస్తూ గుజరాత్‌లోని పోర్‌బందర్ జిల్లాకు దక్షిణ-నైరుతి దిశలో 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నందున, మత్స్యకారులు లోతైన సముద్ర ప్రాంతాలు, ఓడరేవుల నుంచి తీరానికి తిరిగి రావాలని సుదూర హెచ్చరిక సిగ్నల్ ఎగురవేయాలని సూచించినట్లు అధికారులు గురువారం తెలిపారు.