UP: తోడబుట్టిన సోదరుడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ సొంత భర్త ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన మీరట్‌లో జరిగింది. స్థానిక వస్త్ర వ్యాపారి ఇంటి నుంచి రూ. 30 లక్షలు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఆయన భార్యే నిందితురాలు అని తేలింది. తన సోదరుడి ప్రాణాలు రక్షించేందుకు మూత్రపిండాల చికిత్స కోసం ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది.