కొన్ని రోజుల నుంచి ఏపీలో పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. తన పర్యటనలో భాగంగా ‘అందరూ కలిసి ముందుకు రావాలి’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ఈ పొత్తు వ్యవహారం అగ్గి రాజేసుకుంది. దీంతో.. ఏపీ నేతల నోట పొత్తు మాటలే వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అంశం మీదే ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తమ సీఎం జగన్‌ని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకపోవడం వల్లే, చంద్రబాబు పొత్తుల్ని…