Police Raids: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రోజువారీ కూలీ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. కోటిన్నర రూపాయల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి మహేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధురాలు గురవమ్మ రోజువారీ కూలి.. రైస్ పుల్లింగ్ చేస్తున్నారంటూ ఎస్పీకి వచ్చిన సమాచారంతో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో గురవమ్మ ఇంట్లో 800 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి, 5 లక్షల 65 వేల నగదు గుర్తించి స్వాధీనం…